×

పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రథమ లక్ష్యం

 

పేదింటి ఆడపడుచులకు అండగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌.

 

. సింగిడి ప్రతినిధి, వరంగల్ , ఏప్రిల్ 20 ,2025

*పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా ముఖ్యమంత్రి సహాయనిధి నిధులు అందిస్తామన్న ఎమ్మెల్యే నాగరాజు

ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) పేదలకు పెన్నిదని  వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపిఎస్ అధికారి కే ఆర్ నాగరాజు అన్నారు.  పర్వతగిరి మండలానికి సంబందించిన 49 మంది లబ్దిదారులకు రూ.15,22,500 మరియు సిఎం రిలీఫ్ ఫండ్ మరియు 97 మంది లబ్దిదారులకు 97 లక్షల 11వేల 252 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పర్వతగిరి మండల కేంద్రం లోని ఎమ్మార్వో కార్యాలయం నందు లబ్ధిదారులకు అందించారు.

అనంతరం ఎమ్మెల్యే నాగరాజు  మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఈ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆపన్న హస్తం అందిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని తెలిపారు….

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా నూతన వధూవరులకు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించబడిందని అన్నారు…

పేదింటి ఆడపడుచులకు అండగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ ఉన్నదని ఎమ్మెల్యే నాగరాజు గారు అన్నారు.

 

వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు అందిస్తున్నారన్నారు.పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గత ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన సీఎం సహాయ నిది చెక్కులను సైతం తీసుకు వచ్చి పంపిణి చేయడం జరుగుతుందన్నారు. క్యాంప్ కార్యాలయం కు వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.కాంగ్రెస్‌ పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు…

సన్న వడ్లు పండించిన రైతులకు పద్ధతి ధరతో పాటు 500 రూ.. బోనస్ అందిస్తూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్న గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్నారు. పర్వతగిరి మండల పరిధి లోని జమాల్ పురం గ్రామంలో మొదటి విడతగా లక్ష రూపాయలు జమ కావడం జరిగిందన్నారు…పర్వతగిరి మండలం కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు..నిరుదోగ్య యువతకోసం రాజీవ్ యువ వికాసం పథకం రాష్ట్ర ప్రభుత్వం అమ్మల్లోకి తీసుకు వచ్చిందన్నారు. పర్వతగిరి మండలం లో ఇప్పటివరకు సుమారు 2500 వరకు అప్లికేషన్ వచ్చాయి అన్నారు…మీకు ఏ సమస్య ఉన్న సుదూర ప్రాంతాల నుంచి నా దగ్గరికి రాకుండా నా డయల్ యువర్ ఎమ్మెల్యే టోల్ ఫ్రీ నెంబర్ 8096107107 నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్య చెప్తే త్వరలోనే పరిష్కార దిశగా ముందుకు వెళ్తామన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలో మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ మన వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యంగా ముందుకు వెళ్తున్నమన్నారు.

ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, చౌటపల్లి , కల్లెడ పాక్స్ చైర్మన్ గొర్రె దేవేందర్, మనోజ్ గౌడ్, డైరెక్టర్లు, స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు బానోతు భాస్కర్ నాయక్, మండల మహిళా అధ్యక్షురాలు మాసాని సువార్త, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగు వినయ్ మండల, గ్రామ, స్థాయి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, ఎమ్మార్వో, ఎంపీడీవో, తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!