పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ప్రజాసింగిడి స్టాపర్,మెదక్ ఆగస్టు24
మెదక్ పట్టణ లోని టీఎన్జీవో భవన్ లో ఆదివారం నాడు 1975, 76 సంవత్సరానికి చెందిన S S C మరియు 1978- 90 ఇంటర్మీడియట్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ ఓకే పాఠశాలలో చదివిన వారు ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైన ప్రతి ఒక్కరికి కండువా కప్పి మెమెంటో తో సత్కరించారు. పిటి ప్రభాకర్ , డి ప్రభాకర్ , ఎస్ రమేష్ కుమార్ , మంగ రమేష్ గౌడ్ , పి పార్ధ గుప్తా , సి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వివిధ హోదాలో పని చేసి రిటర్మెంట్ అయిన తోటి మిత్రులు కలయికతో ప్రాంగణం కారచాలా ధ్వనులతో దద్దరిల్లిపోయింది కొందరు మిత్రులు చనిపోవడంతో కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మెదక్లో చదువుకొని 60 సంవత్సరాలు గడిచినా మన జీవితంలో చిన్ననాటి మధురానుభూతులను నెమరు వేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు.
Post Comment