పుట్టిన రోజు సందర్భంగా వీర శివాజీ మహారాజ్ విగ్రహం ఆవిష్కరణ
దేశంలోని పేద ప్రజలందర తరుపున పోరాడి నిలిచిన మహనీయుల విగ్రహాలను
వెనకబడిన మారుమూల గ్రామాలలో ఏర్పాటు చేయడం
అభినందనీయమని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల కొనియాడారు.
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మే, 5.
హిందూ బీసీ మహాసభ జాతీయ ప్రధానకార్యదర్శి బండారి గంగాధర్ ఆధ్వర్యంలో పిల్లుట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గ్రంధాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి,బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్నతో కలిసి సోమవారం వెన్నెల ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ శివాజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆమె సూచించారు. అంతకు ముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులను బండారి గంగాధర్ సంతోష దంపతులు శాలువాలతో ఘనంగా సన్మానించారు




Post Comment