పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదం
8 మంది మృతి చెందగా, దాదాపు 26 మందిని పలు ఆసుపత్రులకు తరలించారు.
ప్రజా సింగిడి ప్రతినిధి జహిరాబాద్. జూన్, 30.
*సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలిని ఎమ్మెల్యేలు మాణిక్ రావు ,చింతా ప్రభాకర్ , డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,ఇతర నాయకులతో కలిసి సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి అందిస్తున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్…ఘటన జరిగి ఐదు గంటలు గడుస్తున్నా సహాయక చర్యలు అందించడంలో, కుటుంబ సభ్యులకు వివరాలు తెలపడంలో వైఫల్యం అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం ఇంత పెద్ద పేలుడు జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగే సమయంలో కంపెనీలో మొత్తం 140 మంది పని చేస్తున్నట్లు తెలుస్తున్నది.మొత్తం నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలి
8 మంది మృతి చెందగా, దాదాపు 26 మందిని పలు ఆసుపత్రులకు తరలించారు.
మిగతా వారి పరిస్థితి తెలియరావడం లేదు. ఎంత మంది బయటికి రాగలిగారు అనేది అర్థం కాని పరిస్థితి
కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చెందుతున్నారు. తమవారి జాడ చెప్పాలని అధికారులను వేడుకుంటున్నారు.
కుటుంబ సభ్యులకు వివరాలు తెలిపే ప్రయత్నం చేయాలని కలెక్టర్, ఎస్పీ గని కలిసి చెప్పాను.
ఇతర రాష్ట్రాల వారు ఇక్క్డడ పని చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ప్రమాదం జరిగి 5 గంటలు గడుస్తున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
కంట్రోల్ రూం పెట్టండి, కామన్ ఫోన్ నెంబర్ పెట్టండి అని అధికారులకు సూచించాను.
ప్రమాదం జరిగి 5 గంటలు అవుతున్నది ఏం చేస్తున్నరు?
వివరాలు తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నరు?
ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ వెతికేందుకు ఎన్డీఆర్ఎఫ్ అద్బుతంగా పని చేస్తున్నది.
కానీ, ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వం, అధికార యంత్రాంగం పని చేస్తున్నది.
ప్రత్యేక అధికారులను పెట్టుకోండి, అటెండెన్స్ లిష్ట్ పెట్టుకోండి.
డ్యూటీలో ఎంత మంది ఉన్నరు అంటే కలెక్టర్ ఒక లెక్క, ఎస్పీ ఒక లెక్క చెబుతున్నారు.
5 గంటల నుంచి ఏ వివరాలు లేవు, బాధ్యత రాహిత్యంగ పని చేస్తున్నది ప్రభుత్వం
అసలు కార్మిక శాఖ, ప్రభుత్వం ఏం చేస్తున్నది?
ఇక్కడకు వచ్చే కుటుంబ సభ్యులు ఎవరిని కలవాలో చెప్పండి.
హ్యాండ్ మైక్ పెటుకొని గైడ్ చేసే బాధ్యత లేదా?
గాయపడ్డ వారిని ప్రైమేరీ కేర్ ఆసుపత్రుల్లో జాయిన్ చేస్తున్నారు.
30శాతం కాలితే డేంజర్, కార్పొరేట్ ఆసుపత్రులకు వారిని ఎందుకు పంపడం లేదు
ఏఐజీ, కేర్, అపోలో ఆసుపత్రులకు పంపండి.మొదటి గంటలో ట్రీట్మెంట్ అందితే ప్రాణాలు కాపాడవచ్చు. నిర్లక్ష్యంతో గోల్డెన్ అవర్ మిస్ చేస్తున్నారు.
క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడంలో ఫెయిల్ కుటుంబాలకు సమాచారం అందించడంలోనూ ఫెయిల్
ఎంత మంది డ్యూటీలో ఉన్నారో గుర్తించడంలో ఫెయిల్
పారిశ్రామిక వాడలో వరుసగా ఇది మూడో సంఘటన. గతంలో జరిగిన సంఘటనలో 5గురు చనిపోయారు.
వరుస అగ్రి ప్రమాదాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?
ఏడాదిలో మూడో సంఘటన జరగటం దురదృష్టకరం.
ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ఫెయిల్
దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే కాపాడే విధంగా చర్యలు రూపొందించాలి.
చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించి 50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం .




Post Comment