పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పిన ఆర్మీ జవాన్లకు సలాం
ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాద కుక్కల్లారా
తెలంగాణ జాగృతి షాద్ నగర్ మాజీ కన్వీనర్ ఎండి. ముస్తఫా
నరేంద్ర మోడీ తీసుకున్న ఏ చర్యకైనా భారతీయులంతా అండగా ఉండాలి
ప్రజా సింగిడి ప్రతినిధి రంగారెడ్డి . మే ,08
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆపరేషన్ సింధూర పేరుతో ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా భారతీయ సాయుధ దళాలు జరుగుతున్న దాడులను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ఎండి ముస్తఫా తెలిపారు. అప్పుడే ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు తీయడం ఎంతో బాధాకరమని అన్నారు. నరేంద్ర మోడీ సహకారంతో దెబ్బకు దెబ్బతీసిన ఆర్మీ జవానికి సలాం, ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ స్థావరాలని ధ్వంసం చేసిన ఆర్మీ జవాన్లకు ఉద్యమ నమస్కారాలు. ఎంతో సాహసపెతంగా ఆర్మీ జవాన్లు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని కోట్ల మంది భారతీయులు భారత్ వెంట అండగా నిలుస్తారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో భారతదేశం వైపు చూడాలన్న ఉగ్రవాద సంస్థ భయపడే స్థితిలో ఉంది. ఈ రోజు వరకు ఎన్నో అక్రమాలు చేసిన పాకిస్తాని వదిలిపెట్టాం ఇప్పటినుంచి వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఖబర్దార్ పాకిస్తాన్ ద్రోహుల్లారా, భారతదేశంలో ఉండి కూడా పాకిస్తాన్ కి వత్తాసు పలికే ముండాకొడుకుల్లారా రేపు రాబోయే రోజుల్లో భారతదేశం నుండి వెళ్ళగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి.భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు భారతీయ పౌరుల్లాగా బ్రతికి ఈరోజు భారతదేశపు కీర్తి ప్రతిష్ట చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలి. ప్రతి మండలం, ప్రతి జిల్లా నుంచి యువతి యువకులు యుద్ధం చేయడానికి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అన్నారు. ఆపరేషన్ సింధూర పేరుతో చేపట్టిన దాడులతో ఉగ్రవాదం పూర్తిస్థాయిలో కనుమరుగు కావాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.




Post Comment