*పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం*
*పేద ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు*
*భారతదేశంలోనె జీరో పాలిటిక్స్ చేస్తున్నా ఏకైక పార్టీ జనసేన, ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్*
*దేశ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం*
*నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం*
*షాద్ నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అఖిల భారత చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు రాజు నాయక్*
*షాద్ నగర్ లో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు*
*రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమం సేవా కార్యక్రమాలతో హోరెత్తించిన జనసేన శ్రేణులు*
*షాద్ నగర్ ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 02 రంగారెడ్డి జిల్లా*
పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనమని పేద ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు దేశ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని షాద్ నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అఖిల భారత చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు జరుపుల రాజు నాయక్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో రాజు నాయక్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆశ్రఫ్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మెగా అభిమానులకు పంచి పెట్టి సంబరాలు చేసుకున్నారు. జనసేన శ్రేణుల తో రక్తదాన శిబిరం నిర్వహించి సుమారు 100 మంది రక్తదానం చేశారు. అనంతరం మలయాళ స్వామి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజు నాయక్ మాట్లాడుతూ జనసేన పార్టీ 21 సీట్లకు గాను 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేటు సాధించి విజయకేతనం ఎగరవేసే విధంగా చేసి దేశ రాజకీయ నాయకులను ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసిన దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. భారతదేశంలోనే జీరోపాలిటిక్స్ చేస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ, ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. రాబోయే రోజులో షాద్ నగర్ నియోజకవర్గం లో జనసేన పార్టీ ని బలోపేతం చేయడానికి శాయశక్తుల కృషి చేస్తామని అన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం, అన్నదనం ఎంతో గొప్పదని అన్నారు. సేవ కార్యక్రమాలు చేయాలంటే ఒక్క మెగా ఫ్యామిలీ అభిమానులకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే సాధ్యమని అన్నారు . ఆశ్రఫ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో ఆయన అడుగుజాడల్లో సేవకార్యక్రమాలు నిర్వహిస్తామని, షాద్ నగర్ నియోజకవర్గం లో జనసేన పార్టీ విజయకేతనం ఎగరవేసే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆశ్రఫ్, దాసరి శ్రీశైలం, కొర్ర శంకర్ నాయక్, అరవింద్ లింగం నాయక్ రాజు నాయక్, రామక్రిష్ణ, శివ, నాని, శ్రీనివాస్, మహేష్, నరేష్ యాదవ్, అమర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Comment