పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆవుల రాజిరెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి మాసాయిపేట . మే ,02.
మాసాయిపేట మండల పరిధిలోని నాగ్సాన్పల్లి మరియు హకీంపేట గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు .ఈ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2.5 కోట్లు మంజూరు చేసింది. దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రజల కోరికను గమనించిన ఆవుల రాజిరెడ్డి , వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి నాంది పలికారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యాచరణను అభినందించారు.




Post Comment