నూతన వధూవరులను ఆశీర్వదించిన మహబూబాబాద్ శాసనసభ్యులు
డా భూక్యా మురళీ నాయక్
ప్రజా సింగిడి ప్రతినిధి మహబూబాబాద్ . మే ,01.
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో శనిగాపురం గ్రామానికి చెందిన సంగెపు బోడ అనసూర్య- దేవ సింగ్ లేట్)గార్ల కుమారుడు రాకేష్ – దివ్య ల వివాహానికి హాజరైన నూతన నవ వధూవరులను ఆశీర్వదించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా. భూక్యా మురళీ నాయక్ అనంతరం శనిగాపురం గ్రామం, గుండ్లబోడు తండా కు చెందిన బానోత్ సంజీవ నాయక్ – దివ్య గార్ల కుమార్తె శిరీష సచిన్ ల వివాహానికి హాజరైన నూతన నవ వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వివాహం మన సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పర్వదినమని, ఇది రెండు కుటుంబాలను ఒక్కటిగా కలిపే పవిత్ర బంధమని పేర్కొన్నారు. వధూవరులు తమ వైవాహిక జీవితంలో పరస్పర విశ్వాసం, ప్రేమ, సమన్వయం వంటి విలువలను పాటించి, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.అదనంగా, సమాజంలో వివాహ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, కుటుంబ బంధాలను మరింత బలపరచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, పట్టణ నాయకులు,మండల నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామ వాస్త్యులు, తదితరులు, పాల్గొన్నారు ..




Post Comment