నూతన గృహప్రవేశంకు ఎమ్మెల్యే ను ఆహ్వానించినా అభిమాని*
*నూతన గృహప్రవేశంకు ఎమ్మెల్యే ను ఆహ్వానించినా అభిమాని*
ప్రజా సింగిడి ప్రతినిది రమేష్ బాలనగర్ మండలం,జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా. తేదీ: 09 నవంబర్ 2025.
*పేదల గృహ కల సాకారం* – జీడిగుట్ట తండాలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం,ప్రతి కుటుంబానికి తలదాచుకునే ఇల్లు లక్ష్యంగా ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే తెలిపారు.
తండాల అభివృద్ధికి ప్రాధాన్యత
నూతన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి.
బాలనగర్ మండలంలోని జీడిగుట్ట తండా గ్రామపంచాయతీ పరిధిలోని (పంచాంగుల గడ్డ తాండ) లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును నేడు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ,,,,,,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది, ఇల్లు లేని కుటుంబాలకు తలదాచుకునే సొంత గృహం కల్పించడం మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిజంగా అవసరమైన వారికి ఇల్లు చేరేలా పారదర్శక విధానంలో ఇళ్లు నిర్మించి అందిస్తున్నాం అని అన్నారు.
అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, తండాల పురోగతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం.
ప్రతి గ్రామం, ప్రతి తండా అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు నిధులు కేటాయించి పనులు వేగవంతం చేస్తున్నాం.
ప్రజల మద్దతుతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Post Comment