నస్తీపూర్ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు*
*నస్తీపూర్ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు*
హత్నూర మండలం ప్రజా సింగిడి ప్రతినిధి జనవరి 9
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నస్తీపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల లో శుక్రవారం సంక్రాంతి సంబరాలు అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు రంగు రంగుల ముగ్గులు వేసి గాలిపటాలు ఎగురవేశారు.అదేవిధంగా భోగి మంటలు వెలిగించి,విద్యార్థులతో కోలాటం వేయించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి ప్రమీల సాయిలు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు.పండగ సెలవులలో విద్యార్థులు గాలి పటాలు ఎగురవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.చైనా మాంజా ను ప్రభుత్వం నిషేధించింది కావున ఎవరు కూడా చైనా మాంజా వాడకూడదని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి మహేందర్,ప్రధానోపాధ్యాయులు లోక్ నాథ్,ఉపాధ్యాయులు నరేష్,వాలంటీర్ ప్రవళిక,వార్డు సభ్యులు శంకర్,ఎల్లమ్మ,దశరథ,మౌనిక, మమత,కళ్యాణ్ రాజ్, రేనా,ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు విద్యార్థులు,తల్లి తండ్రులు పాల్గొన్నారు.




Post Comment