నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మే 2
మెదక్ జిల్లా, కౌడిపల్లి మండల కేంద్రంలో నరేంద్ర మోడీ కుల గణన మరియు జన గణనకు ఆమోదము తెలిపిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ సర్పంచ్ జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ కులగణనతో దేశంలోని అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఈ విజయం తమదే అంటూ గొప్పులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.దేశాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పాలనలో కులగణన ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఖాజిపేట రాజేందర్, మండల అధ్యక్షుడు ఖాజిపేట రాకేష్, మండల ప్రధాన కార్యదర్శి దుంపల లక్ష్మణ్, కృష్ణ పటేల్, బురుగడ్డ గొల్ల శేకులు యాదవ్, సురేష్ నాయక్, దొంతర బోయిన విజయ్, గొల్ల మహేష్ లు పాల్గొన్నారు.




Post Comment