నరకంగా మారిన రాత్రి ప్రయాణాలు!*
*నరకంగా మారిన రాత్రి ప్రయాణాలు!*
ఎల్ ఈ డి హెడ్ లైట్స్ ప్రమాదాలకు ప్రధాన కారణం*
సగం లైట్ స్టికర్ నిబంధన జాడలేదు*
ప్రజా సింగిడి ప్రతినిధి ఫిబ్రవరి 10 హత్నూర మండలం
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రాత్రి ప్రయాణాలు భయంగా మారాయి. ఎదురొచ్చే వాహనాల ఎల్ఈడి హెడ్ లైట్ల వల్ల కళ్ళు కనిపించకుండా పోతున్నాయి. కానీ ఆర్ టి వో అధికారుల పర్యవేక్షణ లేదు. ప్రజలు ప్రమాదాలు జరిగే అవకాశాలు మాత్రం మెరుగుగా ఉన్నాయని ప్రయాణికులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 8 గంటల తరువాత రోడ్ల మీద నడపాలంటే భయమే పడుతోంది. ఎదురు వాహనాల ఎల్ ఈ డి లైట్స్ కళ్ళను మసకబారిస్తున్నాయి. ఏమి కనిపించకుండా పోతుంది. అంటూ డ్రైవర్ల ప్రయాణికులు ఫిర్యాది చేస్తున్నారు. గతంలో వాహనాల హెడ్ లైట్లకు సగం వరకు బ్లాక్ స్టికర్ అతికించాలని నిబంధన ఉండేది. ఆరూల్స్ ను తొలగించారా అనే స్పష్టం గా తెలియడం లేదు ప్రస్తుతం ఆ నియంత్రణ పూర్తిగా లోపించింది జిల్లా వ్యాప్తంగా రోడ్లు ప్రమాదాలు పెరిగాయి. ఎల్ ఈ డి లైట్స్ తీవ్రత వల్ల డ్రైవర్లు దారి మరిచిపోతూ. ఎదురు వాహనాలు కనిపించకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. స్థానికులు హెడ్లైట్లకు సగం బ్లాక్ స్టికర్ లేదా బ్లాక్ పెయింటింగ్ వేయాలని ఆదేశాలు ఇవ్వాలి లేకపోతే రాత్రి ప్రయాణాలు నిలిచిపోతాయి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్ టివో కార్యాలయం వర్గాల ఈ విషయంపై స్పందన ఇవ్వలేదు రాష్ట్ర స్థాయిలో కూడా ఎల్ఈడి లైట్లు నియంత్రణపై చర్య లేదు పౌరస్థెర్యులు అధికారులను చుక్కణి చేయాలని కోరుతున్నారు. ఈ సమస్యకు వెంటనే పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.




Post Comment