ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర. ఏప్రిల్, 15.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో వివిధ గ్రామాలలో కాసాలా రెడ్డి ఖానాపూర్ దౌల్తాబాద్ నస్తీపూర్ మంగాపూర్ వివిధ గ్రామాలలో ఐకెపి కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మీరెడ్డి యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాసాల గ్రామంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం అమ్ముకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్దతు ధర లభిస్తుందని సన్న వడ్లకు అదనంగా 500 రూపాయల బోనస్ కూడా లభిస్తాని ఎమ్మెల్యే అన్నారు. ధాన్యంలో తరుగు పేరుతో కోతలు లేకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులను ఆదేశించడం జరిగింది. రైతులకు వ్యవసాయ భారం తగ్గించేందుకే ప్రభుత్వం గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హత్నూర మండల్ తాసిల్దార్ పర్వీన్ షేక్ ఎంపీడీవో శంకర్ మాజీ వెల్బర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్డి మాజీ ఎంపీపీ నర్సింలు యాదవ్ మాజీ సర్పంచ్ రాణి రామచంద్ర రెడ్డి సొసైటీ డైరెక్టర్లు గ్రామ యువ నాయకులు ప్రభు కృష్ణ యాదగిరి ప్రభాకర్ నాగేష్ బాలరాజు రైతులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment