త్రాగునీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలి..
జిల్లా కేంద్రంతో పాటు గ్రామాలలో త్రాగునీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలి
◆కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి..
ప్రజా సింగిడి
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాల్ తో కలిసి వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా తీసుకోవలసిన చర్యల విషయమై సంబధిత అధికారులతో సమావేశం అయిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి..
ఈ సమావేశంలో కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన DPO, MPDO, RWS, మిషన్ భగీరథ, అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వేసవి కాలంలో కామారెడ్డి పట్టణం మరియు గ్రామాలలో త్రాగు నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలు ఏ ఒక్క చోటా ఇబ్బంది పడవద్దు అని అధికారులకు తెలియజేశారు.




Post Comment