తూప్రాన్ లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ*
*రాజకీయాలకు అతీతంగా పాల్గొన్న హిందూవులు*
*జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటన కు నిరసన*
ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్,తూప్రాన్, ఏప్రిల్,23.
మెదక్ జిల్లా తూప్రాన్ లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా హిందూ ధార్మిక సంస్థలు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు హిందూవులు స్వచ్ఛందంగా పాల్గొని జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటన కు నిరసన తెలిపారు. మంగళవారం జమ్మూ కాశ్మీర్లో హిందూ సోదరులపై జరిగిన క్రూరమైన సంఘటన నేపథ్యంలో బుధవారం సాయంత్రం తూప్రాన్ మహంకాళి దేవాలయం నుంచి చేతికి నల్ల రిబ్బన్ లు కట్టుకొని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా
హిందూ బంధువులందరూ ఏకమై నిరసన ప్రదర్శన లో భాగస్వాములయ్యారు. తూప్రాన్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జీ.శివానందం ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమన్నగారి జానకిరామ్ గౌడ్, బండారు దుర్గారాజు యాదవ్, స్వర్గం వెంకట నారాయణ, తాటి విఠల్, కే.వేణుగోపాల్, భాస్కర్, రామునిగారి మహేష్ గౌడ్, అర్.అశోక్ కుమార్ గౌడ్, ఆడేపు మధుసూదన్, బొంది రమేష్ గౌడ్, దోమలపల్లి ఆంజనేయులు, మామిండ్ల శ్రీశైలం, నాగులపల్లి సిద్ధిరాములు యాదవ్, పోల శ్రీనివాస్ గుప్త, కోడిప్యాక సంతోష్ గుప్త, పసుల నారాయణ తదితరులు పాల్గొన్నారు.




Post Comment