తూప్రాన్ లో కోర్టు ఏర్పాటుకు 25 న ఎంపీడీవో కార్యాలయం అందజేస్తాం.
తూప్రాన్ లో కోర్టు ఏర్పాటుకు 25 న ఎంపీడీవో కార్యాలయం అందజేస్తాం.
-ఆర్డీవో జయచంద్రారెడ్డి.
ప్రజాసింగిడి తూప్రాన్,మెదక్ జిల్లా స్టాపర్ సెప్టెంబర్ 18
మెదక్ జిల్లా తూప్రాన్ లో కోర్టు స్థాపనకు ఈనెల 25వ తారీఖున ఎంపీడీవో బిల్డింగ్ అప్పగించడం జరుగుతుందని అందులో కొన్ని మర్మతులతో త్వరలో కోర్టు ప్రారంభమవుతుందని తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి తెలిపారు.గతంలోనే తూప్రాన్ కు కొత్త కోర్టు మంజూరి జరిగిందనీ అయితే సరి అయిన వసతి దొరకక కోర్టు ప్రారంభం కాలేదని,దీనికోసం జిల్లా జడ్జి గతంలో చాలా ప్రైవేటు మరియు ప్రభుత్వ భవనాలను పరిశీలించారని, చివరికి ప్రస్తుతం ఎంపీడీవో ఆఫీస్ గా ఉపయోగిస్తున్న భవనాన్ని ఖరారు చేశారని ఆర్డీవో తెలిపారు.అయితే కొత్తగా నిర్మాణంలో ఉన్న డివిజనల్ కార్యాలయాల ఉమ్మడి భవనము ఇంకా పూర్తి కాలేదని, ఒకవేళ పూర్తి అయినట్లయితే ఎంపీడీవో కార్యాలయాన్ని అందులో షిఫ్ట్ చేయడం జరుగుతుందని కోర్టు వారికి తెలపడం జరిగిందనీ కానీ కోర్టు వారు ఇదే బిల్డింగ్ కావాలి అని చెప్పడంతో వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ,ఆదేశాలతో ప్రస్తుతం నిర్మాణంలో ఉండి ఇంకా పూర్తికాని డివిజనల్ కార్యాలయాల సముదాయంలో ఎంపీడీవో ఆఫీస్ కు సంబంధించిన గదులను తాత్కాలికంగా పూర్తి చేసి,అందులోకి ఎంపిడిఓ ఆఫీసును షిఫ్ట్ చేయాలని,అలాగే మార్కెట్లో పాత గ్రామపంచాయతీ బిల్డింగ్ లో కొనసాగుతూ వసతుల లేమితో ప్రజలకు ఇబ్బందిగా ఉన్న తహశీల్దార్ కార్యాలయం కూడా అందులోకి మార్చాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారని తెలిపారు.మంత్రి సూచనతో తాత్కాలికంగా ఈ రెండు కార్యాలయాల కోసం ఐడిఓసి బిల్డింగ్ లో గదులను యుద్ధ ప్రాతిపదికన అందుబాటులో ఉన్న నిధులతో తయారు చేయిస్తున్నారని వచ్చే సోమవారం లోపు ఎంపీడీవో ఆఫీసుకు ప్రతిపాదిస్తున్న గదులు తయారవుతాయని ఆయన తెలిపారు.ఐడిఓసి బిల్డింగ్లో మొత్తం 28 ప్రభుత్వ కార్యాలయాలను ప్రతిపాదించారు.అయితే అది పూర్తి కావడానికి ఇంకొంత సమయం ఉన్నందున తూప్రాన్ పట్టణంలో కోర్టును అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సి ఉన్నందువల్ల తాత్కాలికంగా ఎంపీడీవో ఆఫీసును మరియు తహశీల్దార్ ఆఫీసును ఈనెల 22 లోపు అందులోకి షిఫ్ట్ చేయడం జరుగుతుందని,ఆ తర్వాత 25వ తారీఖున ప్రస్తుత ఎంపీడీవో కార్యాలయ బిల్డింగును కోర్టు వారికి స్వాధీన పరుస్తామని ఆ తర్వాత అందులో త్వరలోనే కోర్టు ఏర్పాటు జరుగుతుందని తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి తెలియజేశారు.తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజున విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 28 ప్రభుత్వ శాఖల బిల్డింగ్ పూర్తి కావడానికి ఇంకొంత సమయం పడుతుందని బిల్డింగ్ పూర్తయిన తర్వాత ఐడిఓసి బిల్డింగ్ ఇనాగ్రేషన్ గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఉంటుందని తెలియజేశారు.
Post Comment