తన అరెస్ట్ వెనక ఓ పెద్దమనిషి హస్తం…
తన అరెస్ట్ వెనక ఓ పెద్దమనిషి హస్తం…
◆- టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
◆రాజకీయంగా అడ్డుకునేందుకే అరెస్ట్.
◆తన పేరు మీద ఇంచు భూమికుడా లెదు.
◆రాత్రి 8 గంటలకు స్టేషన్ కి వచ్చి కలవాలని తనకు సిఐ ఫోన్.
◆రాత్రి 9 గంటలకు,ఎస్పీ మీతో మాట్లాడుతారట అని ప్రయివేట్ వాహనంలో తీసుకెళ్లిన రూరల్ సిఐ.
◆తీరా గమనిస్తే ఎస్పీ కార్యాలయం వైపు కాకుండా హైవే వైపు మళ్ళిపు.
◆రాత్రి 12 గంటలకు బాన్సువాడ లో మళ్ళీ వెంచర్ కి సంబంధించి ప్రశ్నలు..
◆బాన్సువాడ లో వైద్య పరీక్షల అనంతరం అరెస్ట్..
◆రాత్రి 3 గంటలకు జడ్చి వద్ద హాజరు.
◆ఉదయం 6 గంటలకు నిజామాబాద్ సబ్ జైల్..
◆పోలీసుల వ్యవహార శైలి పై ఐజి కి పిర్యాదు చేయనున్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి.
ప్రజా సింగిడి- కామారెడ్డి,జులై 11:
రాజకీయ కుట్రలో భాగంగానే పేలుడు పదార్థాల కేసులో తనను అరెస్ట్ చేశారని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ తెలిపారు. గురువారం రాత్రి జైలు నుంచి విడుదలైన ఆయన శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాధిక గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన అరెస్ట్ వెనక ఓ పెద్దమనిషి హస్తం ఉందన్నారు. ఈ సందర్భంగా పలు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ నెల 3న జిల్లా కేంద్రంలో లభించిన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ ( పేలుడు పదార్థాల ) కేసులో తన పేరు చేర్చారని తెలిసిందన్నారు. దీంతో ఈ నెల 5న సీఐ నరహరి కి ఫోన్ చేసి శ్రీవారి వెంచర్ కి సంబంధించిన పత్రాలను పంపడం జరిగిందన్నారు. తన పేరుమీద ఇంచు భూమి కూడా లేదని సీఐకి తెలపగా తిరిగి రాత్రి 8 గంటలకు సీఐ తనకు ఫోన్ చేసి స్టేషన్‌కు వచ్చి కలవాలని చెప్పడంతో వెంటనే వెళ్లానని తెలిపారు.తాను వెళ్లేసరికి స్టేషన్లో ఏఎస్పీ చైతన్య రెడ్డి ఉన్నారని, ఏఎస్పీకి తన పేరున ఎలాంటి భూమి లేదని సంబంధిత పత్రాలు ఇవ్వడం జరిగిందని వివరించారు. రాత్రి 9 గంటలకు రూరల్ సీఐ రామన్ వచ్చి ఎస్పీ మీతో మాట్లాడుతారట వెళ్దామని చెప్పి ఓ ప్రైవేట్ వాహనంలో తనను ఎస్పీ కార్యాలయం వైపు కాకుండా నేరుగా హైవే వైపు మళ్లించారని చెప్పారు.ఇదే విషయాన్ని తాను సీఐని అడిగితే మళ్లీ వెంచర్‌కు సంబంధించిన ప్రశ్నలే అడిగితే సమాధానం చెప్పానన్నారు. తనను నేరుగా రాత్రి 12 గంటలకు బాన్సువాడ తీసుకెళ్లి ప్రాథమిక పాఠశాలలో కూర్చోబెట్టి మళ్లీ ప్రశ్నలు అడిగారని తెలిపారు. అక్కడి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నామని అప్పుడు చెప్పారన్నారు. రాత్రి 3 గంటలకు బిచ్కుంద జడ్జి వద్ద హాజరు పరిచారని, ఉదయం 6 గంటలకు నిజామాబాద్ సబ్ జైలుకు తీసుకెళ్లారని వివరించారు. ఈ మొత్తం వ్యవహారం రాజకీయ కుట్రతోనే జరిగిందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఓ మాజీ కౌన్సిలర్ తనపై దుష్ప్రచారం చేశారన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. రాత్రి 8 గంటలకు ఇంట్లో నుంచి తానే స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లి పూర్తిగా వాళ్లతోనే ఉన్నానని, ఎఫ్ఐఆర్ లో మాత్రం తాను తప్పించుకుని తిరుగుతున్నానని, అశోక్ నగర్ వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుకున్నారని పొందుపరచడం ఎంతవరకు సమంజసమో పోలీసులు చెప్పాలన్నారు. నాలాంటి వారి పట్లనే పోలీసులు ఇలా ప్రవర్తిస్తే సామాన్య ప్రజల పట్ల ఎలా ఉంటారోనని అనుమానం వ్యక్తం చేశారు. అరెస్ట్ రోజు తనను తానుగా వచ్చానా.. ? పట్టుకుని అరెస్ట్ చేసారా పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై భూమి లేదని తెలిసినా కేసులో చేర్చారన్నారు.తన అరెస్టు వెనుక ఓ 70 ఏళ్ల రాజకీయ పెద్దమనిషి వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లానని, పార్టీ తన పట్ల సానుకూలంగా ఉందన్నారు. తన ఎదుగుదలను ఓర్వలేక తన ప్రతిష్టకు భంగపరిచిన వారికి ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు. పోలీస్ అధికారి తనపట్ల ఇలా వ్యవహరించడం సరికాదని, పోలీసుల వ్యవహార శైలిపై నేరుగా ఐజీకి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment