డిగ్రీ కళాశాలలు జూన్ 2న తెరిచారు… అధ్యాపకుల రెన్యువల్ మరిచారు..!
డిగ్రీ కళాశాలలు జూన్ 2న తెరిచారు… అధ్యాపకుల రెన్యువల్ మరిచారు..!
ప్రజా సింగిడి, ఆదిలాబాద్, జూలై 14:
డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ సమస్యల పై అదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ (DGLA) జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి బి రాహుల్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
డిగ్రీ కళాశాలలు ప్రారంభమై 40 రోజులైనా డిగ్రీ గెస్ట్ లెక్చరర్ లకు రెన్యువల్ చేయకుండా కాలయాపన చేయడంతో అధ్యాపకులకు మరియు విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని… డిగ్రీ కళాశాలలో జూన్ 2న తెరిచారు అధ్యాపకుల రెన్యువల్ మరిచారు..!
రాష్ట్రంలో 8 యూనివర్సిటీల పరిధిలోని 149 డిగ్రీ కళాశాలలో 1940 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. మా సేవల పైననే 30 నుండి 90% వరకు కళాశాలలు నడుస్తున్నాయి. జూన్ 2 నుండి కళాశాలలు నడుస్తున్నాయి. కానీ నేటికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాఠాలు బోధించే డిగ్రీ గెస్టు లెక్చరర్స్ లేక గత సంవత్సరంలో పనిచేసిన వారిని రెన్యువల్ తో సర్వీస్ కంటిన్యూ చేయకపోవడంతో విద్యార్థులకు పాఠాలు బోధించే అవకాశం లేకుండా పోయింది. దీంతో సిలబస్ కాక పాఠాలు అర్థం చేసుకోలేక విద్యార్థుల సందేహాలు తీర్చేవారు లేక విద్యార్థులు అయోమయ గందరగోళ పరిస్థితిలో అవస్థలు పడుతున్నరు. గెస్ట్ లెక్చరర్స్ నియామక నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో విద్యార్థుల పాలిట శాపంగా మారి విద్యా ప్రమాణాలు దెబ్బతినే అవకాశం ఉంది.
ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని గత సంవత్సరంలో పనిచేసిన డిగ్రీ గెస్టు లెక్చరర్ లను రెన్యువల్ చేయాలంటూ కోరారు.1. ‘త్రీ మెస్ కమిటీతో డెమో తీసుకునే విధానాన్ని రద్దు చేసి, గత సంవత్సరంలో పనిచేసిన ప్రతి డిగ్రీ గెస్ట్ లెక్చరర్ ను రెన్యువల్ తో సర్వీస్ కంటిన్యూ చేయాలి. 2. ‘గంటల పని విధానాన్ని రద్దు, కన్సాలిడేటెడ్ పే అమలు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతినెల 50వేల కన్సాలిడేటెడ్ పే తో 7 నెలలకు కాకుండా 12 నెలలకు వేతనం చెల్లించాలంటూ డిమాండ్లను కోరారు..
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి బి రాహుల్ ఉపాధ్యక్షులు సుభాష్ కోశాధికారి ఆనంద్ ,నారాయణ జావిద్ ,ప్రవీణ్ కుమార్ వివిధ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.




Post Comment