జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉసిరికపల్లి ప్రాథమిక పాఠశాలలో సమ్మర్ క్యాంప్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 25
జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శివంపేట్ మండలంలోని ఉసిరికపల్లి ప్రాథమిక పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ను జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ మరియు రక్ష ఏ ఎస్ ఓ చరణ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిలత చేతుల మీదుగా ప్రారంభించారు.జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏప్రిల్ 24 నుండి మే 10 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని గ్రామంలోని ప్రతి విద్యార్థి తప్పకుండా ఈ క్యాంప్ లో పాల్గొనాలని తెలిపారు .పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాయిలత మాట్లాడుతూ పిల్లలకు ఈ వేసవి శిక్షణా శిబిరంలో డ్యాన్స్, సంగీతం, డ్రాయింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, చేతి వ్రాతలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వేసవి శిక్షణ శిబిరానికి సహకారం అందించిన జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారికి మరియు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ , రక్ష ఏ ఎస్ ఓ చరణ్ , గ్రామ పెద్దలు కృష్ణారావు, సురేందర్ రెడ్డి, వేణు కుమార్, కృష్ణా, ఉదయశ్రీ మొదలైన వారు పాల్గొన్నారు.




Post Comment