జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి జి జి హెచ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్…..
ప్రజా సింగిడి ప్రతినిధి సంగారెడ్డి. మర్చి, 25.
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి జి జి హెచ్ ను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. విధులకు హాజరుకాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని స్పష్టం చేశారు. మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన మార్పులపై అధికారులకు సూచనలు ఇచ్చారు. సమయానికి హాజరుకాని వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే బాధ్యత ప్రతి ఉద్యోగి నెరవేర్చాలని కలెక్టర్ స్పష్టం చేశారు




Post Comment