జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ జి ఎఫ్ నూతన సెక్రటరీగా లావుడియా జయపాల్
ప్రజాసింగిడి భూపాలపల్లి జిల్లా ఆగస్టు 23
జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నూతన సెక్రటరీగా జెడ్పిహెచ్ఎస్ రంగయ్యపల్లి ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఎల్ జయపాల్ ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఫిజికల్ డైరెక్టర్లు వ్యాయామ విద్య ఉపాధ్యాయులు అందరూ కలిసి సమిష్టిగా ఎల్ జైపాల్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారని ఈ ఎంపిక ప్రశాంత వాతావరణంలో జరిగిందని తెలిపారు నూతనంగా ఎంపికైన ఎస్జీఎఫ్ సెక్రటరీ లావుడియ జైపాల్ మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్జీఎఫ్ క్రీడల క్యాలెండర్ను సోమవారం విడుదల చేస్తామని రాష్ట్ర ఎస్జీఎఫ్ ఆదేశాల మేరకు జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల నిర్వహణ జరిపిస్తామని దీనికి జిల్లాలో పనిచేస్తున్నటువంటి వ్యాయామ విద్య ఉపాధ్యాయులు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు ఈ ఎన్నికకు సహకరించిన జిల్లా విద్యాధికారి ముద్దమల్ల రాజేందర్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు నూతనంగా ఎన్నికైన ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ లావుడియా జైపాల్ కు పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు
Post Comment