జడ్చర్ల ఎమ్ ఎల్ ఏ గారితో గ్రామ అభివృద్ధి కొరకై విన్నవింపులు
ప్రజాసింగిడి ప్రతినిధి బాలనగర్ మండలం, జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా, 01,మే, 2025.
జడ్చర్ల శాసనసభ్యులు, జనంపల్లి అనిరుద్ రెడ్డి ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి గ్రామ అభివృద్ధి కొరకై పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు అలాగే నూతనంగా ఎన్నుకోబడిన యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జి,కిషోర్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ వార్డ్ మెంబర్ కే సుధాకర్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆర్ రాజు మరియు సోషల్ మీడియా జి యాదగిరి మరియు కాంగ్రెస్ నాయకులు, డాక్టర్ రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.




Post Comment