చిన్న ఘనాపూర్ ఐఎంఎల్ డిపోలో…
చిన్న ఘనాపూర్ ఐఎంఎల్ డిపోలో…
– సెక్యూరిటీ గార్డుల పోస్టుల సమస్య….
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి సెప్టెంబర్ 14
మెదక్ జిల్లాకొల్చారం మండలం చిన్న గణపురం ఐ ఎం ఎల్ డిపోలో .. గతంలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసిన… కొంతమంది.. రిటర్మెంట్ అయ్యారు… వారి స్థానంలో కొత్తవారిని నియమించారని తెలుసుకున్న చిన్న ఘనాపూర్ గ్రామ నిరుద్యోగ యువకులు గతంలో ఉపాధి లేక ఐ ఏం ఎల్ డిపో ముందు హమాలీ పని కోసం, సెక్యూరిటీ గార్డ్ కోసం, డిపోలో ఏదైనా సపాయి పని కానీ, ఆఫీస్ బాయ్ గా కానీ పని దొరుకుతదేమో అని గత రెండు నెలలు పగలు రాత్రి అనక టెంటు వేసుకొని కూర్చున్న రోజులు ఉన్నాయి. తీరా ఆరాతిస్తే గతంలో ధర్నా చేసిన హమాలి యూనియన్ సంఘంలో నుండి ఐదుగురు సభ్యులను హమాలి సంఘం యూనియన్ సంఘ సభ్యులకు తెలియకుండా సెక్యూరిటీ గార్డ్ పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుసుకున్న చిన్నగనాపూర్ నిరుద్యోగ యువకులు గత వారం రోజుల క్రితం ఐఏంఎల్ డిపో ముందు ధర్నాకు దిగారు. సుమారు 150 వరకు అమాలి యూనియన్ సభ్యులు ఉన్న వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఐఎంఎల్ డిపోలో సెక్యూరిటీగా ఒక్కరోజు డ్యూటీ చేస్తున్నారని తెలుసుకున్నారు. గ్రామ యువకులు వారిని బయటకు పంపేంతవరకు డిపో ముందు ధర్నా చేస్తామని చెప్పడంతో కొల్చారం పోలీసులు డిపో వద్దకు చేరుకొని నిరుద్యోగ యువకులను సముదాయించి మీరు ఏమైనా మాట్లాడుకోవాల్సి ఉంటే మీ ఊరు పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని నిరుద్యోగ యువకులకు సముదాయించడంతో అక్కడి నుండి యువకులు వెళ్లిపోయారు.
– ఐఎంఎల్ డిపోలో సెక్యూరిటీ గార్డుల సమస్య…
గత వారం రోజుల క్రితం ఐఎంఎల్ డిపోలో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల కోసం చిన్న ఘనపూర్ గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకులు కొంతమంది పెద్దలు, గ్రామ ప్రజల సమక్షంలో చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకులకు సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఇవ్వాలని చిట్టీల ద్వారా నిర్ణయించారు. వారి సమక్షంలోనే పేర్లను కూడా నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే? ఇప్పటివరకు వారిని సెక్యూరిటీ పోస్ట్ కొంతమంది గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సమక్షంలో నిర్ణయించిన వారిని ఎందుకు సెక్యూరిటీ గార్డు పోస్టు ఇవ్వకపోవడంపై చిన్న ఘనపూర్ గ్రామంలో గందరగోళం నెలకొంది.
Post Comment