చట్టాలపై అవగాహన సదస్సు,
జడ్జి, గంట,కవితా దేవి
జహీరాబాద్ మర్చి 09 ప్రజా సింగిడి న్యూస్
జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం ఎంపీడీఓ కార్యాలయం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ క్యాంపును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ కవిత దేవి నిర్వహించి మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించి, తగు సూచనలు చేశారు. న్యాయమూర్తి న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతీ మహిళ సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నిత్యజీవితంలో మహిళలు ఎన్నో కష్టాలకు గురివుతున్నారని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురుకాకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలువస్తే వాటిని అధిగమించడానికి చట్టాలు తొడ్పాడుతాయని సూచించారు. కార్యక్రమంలో నిజజీవితంలో మహిళల పాత్ర, గృహహింస నిరోధకత, మహిళా సాధికారత, పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, బాల్య వివాహ నిరోధక చట్టం, ఉచిత న్యాయసేవా సహాయంపై క్షుణ్ణంగా వివరించారు. ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బార్ వైస్ ప్రెసిడెంట్ మానెన్న ప్యానెల్ న్యాయ వాదులు రుద్రయ్య స్వామి సామజిక కార్యకర్త కోట ధనరాజ్ ఎంపిడిఓ సుధాకర్ తహసీల్దార్ తిరుమల రావు ఎస్సై సాయి తేజ , లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.




Post Comment