ఘనంగా జర్నలిస్ట్ పితామహుని జన్మదిన వేడుకలు
ప్రజా సింగిడిమెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మే 29
మెదక్ జిల్లా కౌడిపల్లి రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు, ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి జర్నలిస్టు అయిన రామానంద చటర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి, హాజరయ్యారు. ముందుగా రామానంద చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ… భారతదేశంలో మొట్టమొదటి జర్నలిస్ట్ అయిన రామానంద చటర్జీ పేరుతో భారతదేశంలో తొలిసారిగా మెదక్ జిల్లా కౌడిపల్లి లో నాగరాజు, ఆధ్వర్యంలో ఆయన పేరుతో ప్రెస్ క్లబ్ నీ ప్రారంభించి ఆయనని స్మరించుకోవడం జర్నలిస్టులకు గర్వించదగ్గ విషయం అని అన్నారు. జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అవినీతిని వెలికి తీసినప్పుడే జర్నలిస్టులకు విలువ అనేది దక్కుతుంది అలాగే రాజకీయ నాయకులు గాని ప్రజా ప్రతినిధులు గాని ప్రజలకు సేవ చేస్తూ సమాజ అభివృద్ధికి పాటుపడినప్పుడే గుర్తింపు వస్తుందని ఆమె అన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి ప్రెస్ క్లబ్ మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు బిసి ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి గంగాధర్, కొల్చారం మండల్ మాజీ ఎంపీపీ సావిత్రి రెడ్డి, జర్నలిస్టులు, జర్నలిస్ట్ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




Post Comment