గ్యాస్ లీక్.. చెలరేగిన మంటలు
తల్లీకొడుకులకు గాయాలు
పరామర్శించిన ఎమ్మెల్యే,
జహీరాబాద్ , ప్రజా సింగిడి ప్రతినిధి అగస్ట్ 06 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం : ఏడోకులపల్లి గ్రామంలో బుధవారం ఉదయం ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగ డంతో ఇద్దరికి ముగ్గురికి గాయాలయ్యా యి. ఈ ఘటన ఝరా సంగం మండలంలోని ఏడాకులపల్లిలో ఇవాళ ఉదయం జరిగింది. గ్రామంలోని గొర్రెకంటి శంకరమ్మ ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసా రిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో శంకరమ్మకు తీవ్ర గాయాలు కాగా ఆమె కుమారులు ప్రభు, విఠల్ చేతులకు గాయా లయ్యాయి. గ్రామస్తులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించగా స్పందించిన వైద్య సిబ్బంది వారిని జహీరా బాద్ ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలు*
జహీరాబాద్
ఝరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రె కంటి శంకరమ్మ అనే మహిళ బుధవారం ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలినట్లు తెలిసింది. ప్రమాదంలో శంకరమ్మ తో పాటు ఆమె కుమారులు ప్రభు, విట్టల్ లకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా సమాచారం అందుకున్న ఈఎంటి శంకర్, పైలెట్ సాగర్, సంఘటన స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్ లో క్షతగాత్రులను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్స్ సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని వారు తెలిపారు.




Post Comment