గణేష్ మండపాల ను ఆన్ లైన్ చేసుకొని, ఉత్సవాలు శాంతి యుతంగా జరుపు కోవాలి
ప్రజా సింగిడి కామారెడ్డి ఆగస్టు 23
👉🏻 కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి.గణేష్ మండపాల నిర్వహకులు ఆన్లైన్ లింక్ ద్వారా విగ్రహాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలి భద్రత, బందోబస్తు కొరకే గణేష్ ఆన్లైన్ నమోదు విధానం. భిన్నత్వంలో ఏకత్వంలో పండగలు జరుపుకోవడం మన కామారెడ్డి జిల్లా సంప్రదాయం
వివిధ షాపుల నుండి వినాయకుల విగ్రహాలు సంబంధిత మండపాలకు తీసుకొని వెళ్లేటప్పుడు కరెంటు వైర్ల విషయంలో నిర్వాహకులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి
సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలి*
పోలీసుల సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలి శాంతి భద్రతలకు సహకరించాలి జిల్లా ఎస్పి శ్రీ యం. రాజేశ్ చంద్ర ఐపిలఎస్
గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరియు శోభాయాత్రల సందర్భంగా ప్రజల భద్రత, శాంతి పరిరక్షణ కోసం కామారెడ్డి కళాభారతీ ప్రాంగణంలో సన్నాహక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పి శ్రీ యం. రాజేశ్ చంద్ర, ఐపీఎస్ , జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ విక్టర్, మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, పట్టణ పెద్దలు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా ఎస్పి శ్రీ యం. రాజేశ్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు అందరూ కలిసి స్నేహపూర్వకంగాప్రశాంత వాతావరణంలో జరగాలని ఆకాంక్షించారు. మండపాల ఏర్పాటులో నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలని సూచిస్తూ, ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. గణేష్ ఉత్సవ నిర్వాహకులు మరియు వాలంటీర్ల వివరాలతో పాటు వివిధ కార్యక్రమాల సమాచారాన్ని ఆన్‌లైన్ అప్లికేషన్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రజా రవాణా, ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బంది కలగకుండా మండపాలను ఏర్పాటు చేయాలని, కమిటీ బాధ్యత వహించే వారి పేర్లు, ఫోన్ నంబర్లు ప్రదర్శించాలని సూచించారు.
మండపాల వద్ద 24 గంటలు వాలంటీర్లు అందుబాటులో ఉండాలని, భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత స్పీకర్ల వినియోగం లేదు అలాగే డీజే వాడకం పూర్తిగా నిషేధించబడింది. అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫైర్ బాల్స్ లేదా నీటి బకెట్లు తప్పనిసరిగా ఉంచాలని సూచించారు.
అలాగే మద్యం సేవించడం, పేకాట, అసభ్య నృత్యాలు, ఇతర మతాలను కించపరిచే పాటలు లేదా ప్రసంగాలు పూర్తిగా నిషేధించబడ్డాయిసాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు.
ప్రతి మండపంలో తనిఖీ పుస్తకం ఉంచి, అధికారులు తనిఖీ చేసినప్పుడు సంతకాలు చేయాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. దీపాల వల్ల ప్రమాదాలు జరగకుండా ఇసుక/బియ్యం పై ఉంచాలని, వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్‌లను నివారించేలా విద్యుత్ వ్యవస్థను నిపుణులచే సక్రమంగా చేయించుకోవాలని సూచించారు. పరదాలు గాలికి ఎగిరి దీపం తగిలే ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అలాగే సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మరాదని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీ విక్టర్ , జిల్లా అదన ఎస్పి శ్రీ కె. నరసింహారెడ్డి , ఏఎస్పి బి. చైతన్య రెడ్డి , మున్సిపల్ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులువివిధ శాఖల ప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, పట్టణ పెద్దలు పాల్గొన్నారు.
Post Comment