కొందుర్గులో కరెంట్ సామాగ్రి గోడౌన్ పరిశీలన*
*నూతన ట్రాన్స్ ఫారంను ప్రారంభించిన ఎమ్మెల్యే షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*
*షాద్ నగర్ ప్రజా సింగిడి ప్రతినిధి ఆగస్టు 23 రంగారెడ్డి జిల్లా*
షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కరెంటు సమస్యలు కష్టాలు ఉండకూడదని దీనికి సంబంధించిన పూర్తి సామాగ్రి అందుబాటులో ఉండాలని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం నియోజకవర్గంలోని కొందుర్గు మండల కేంద్రంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ను మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, విద్యుత్ శాఖ డిఈ శ్యాంసుందర్ రెడ్డి, ఎడి సత్యనారాయణ, ఏఈ రవికుమార్, విద్యుత్ కాంట్రాక్టర్ సంగేమ్ మధుసూదన్ రెడ్డిలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని విద్యుత్ గోడౌన్ ను పరిశీలించారు. ప్రజలకు అవసరమైన సామాగ్రితో పాటు రైతులకు అవసరమయ్యే ట్రాన్స్ఫార్మర్లు ఇతర వనరులు అందుబాటులో పెద్ద ఎత్తున ఉన్నాయని దరఖాస్తులు వచ్చిన 15 రోజుల్లో సమస్య పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. కరెంటు కష్టాలు ఎక్కడ తలెత్తకుండా విద్యుత్ సిబ్బంది నిరంతరం సమీక్షలు నిర్వహించుకుని పరిశీలన జరుపుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంత ఖర్చు అయినా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సామాగ్రి సమకూర్చే బాధ్యత తనదని శంకర్ సిబ్బందికి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందజేయాలని ఎవరికీ ఏ అవసరం ఉన్న వెంటనే తీర్చే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు. ఈ సందర్భంగా విద్యుత్ సిబ్బందిని, కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి తదితరులను ఎమ్మెల్యే అభినందించారు..
Post Comment