కుటుంబ పెద్దలు మరణించడంతో అనాథలైన పిల్లలకు అండగా ఉంటా
కుటుంబ పెద్దలు మరణించడంతో అనాథలైన పిల్లలకు అండగా ఉంటా
-గజ్వెల్ నియోజకవర్గ భారాస పార్టీ బాధ్యులు వంటేరు ప్రతాప్ రెడ్డి.
ప్రజా సింగిడి ఉమ్మడిమెదక్ జిల్లా ప్రతినిధిసెప్టెంబర్ 18
ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన మంజునాథ్ బార్బర్ పనులు చేసుకునేవారు.గత కొన్ని రోజులుగా మంజునాథ్ అనారోగ్యానికి గురయ్యారు.చికిత్స చేయించుకుంటున్న క్రమంలో వైద్యానికి సరిపడా డబ్బులు లేక పేదరికం అడ్డు రావడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న క్రమంలో మృతి చెందారు.అనంతరం అదే కుటుంబానికి చెందిన భారతమ్మ ఆత్మహత్య చేసుకోగా ఇటీవలే మంజునాథ్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబంలోని పెద్ద దిక్కులైన ముగ్గురు రెండు నెలల వ్యవధిలోనే చనిపోవడంతో 13 సంవత్సరాలు వయసు లోపు చిన్నారులు కూతురు నైనిక కొడుకు అక్షయ్ అనాధలుగా మారారు.విషయం తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బాధ్యులు మాజీ అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో చిన్నారులు నైనిక అక్షయ్ లను పరామర్శించి 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.చిన్నారులు నైనిక అక్షయ్ లను ధైర్యంగా ఉండాలని చెప్పి మనోధైర్యాన్ని కల్పించారు.భవిష్యత్తులో చిన్నారులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి,జిల్లా యువజన అధ్యక్షుడు నాగరాజు,సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి,కనకరాజు,మధుసూదన్ రెడ్డి, జైపాల్ రెడ్
Post Comment