కాసాల- కొత్తపేట (దౌల్తాబాద్ ) రహదారికి ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదల తొలగింపు*
*కాసాల- కొత్తపేట (దౌల్తాబాద్ ) రహదారికి ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదల తొలగింపు*
*సర్పంచ్ కొటముల వెంకటేష్*
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర సంగారెడ్డి జిల్లా స్టాపర్ ఎన్ పవన్ కుమార్ జనవరి 10
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల నుండి కొత్తపేట (దౌల్తాబాద్ )వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలను శనివారం కాసాల గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జెసిబి సహాయంతో తీసివేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశం ఉప సర్పంచ్ కిష్టయ్య మాట్లాడుతూ కాసాల నుండి కొత్తపేటకు (దౌల్తాబాద్ కు) వచ్చే రహదారి కి ఇరువైపుల ముళ్ళపోదలు ఉండడంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారి ఈ రహదారిలో వచ్చి పోయేవారికి చాలామందికి ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. అందుకనే కాసాల గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెంకటేశం అన్నారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా 100 మీటర్లకు ఒకటి చొప్పున స్ట్రీట్ లైట్లు పెట్టిస్తామని ఆయన అన్నారు. పంచాయతీ పాలకవర్గం సభ్యుల సమన్వయంతో ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment