కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం ఖాయం,
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం ఖాయం,
తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 14 సంగారెడ్డి జిల్లా
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం కృష్ణనగర్ A, B,C బ్లాక్స్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గిరిధర్‌రెడ్డి మాట్లాడారు. అంతకు ముందు స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కార దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలుపించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఇతర ముఖ్య నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Comment