కవితా శీర్షిక పూర్వ వైభవం ఎక్కడ
కవితా శీర్షిక పూర్వ వైభవం ఎక్కడ
నవ నాగరికత పేరుతో
చెట్లను నరికిన పాపానికి
పక్షుల జాతి అంతరించ పోయె
యంత్ర పరికరాలు వచ్చి
బసవన్న కనుమరుగై పోయె
రసాయన ఎరువులు మోపై
పెండతట్ట మూలవడి ములుగవట్టె
వరి కోత యంత్రాలు వచ్చి
కొడవళ్ళు మూలవడి తుప్పుపట్టే
బొరు మొటర్ల పుణ్యమా లేక
ప్రకృతి పచ్చదనాన్ని అంతం చేసిన పుణ్యమా
స్వచ్చమైన ఉట నీళ్లు ఎండ మావులు అయ్యే
పడిలేక పనిలేక జనాలు వలసబాట పట్టి
పల్లెల్లోని రచ్చబండ కనుమరుగై పోయె
ఇవన్ని మనకై మనమే చేసుకున్న తప్పిదాలు
ఇప్పటికైనా మన తప్పులు సరిచేసుకుంటూ
పకృతిని పది కాలాలు కాపాడుకుందాం
రచన: శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218.




Post Comment