కళ్యాణ లక్ష్మి చెక్కులను అంధజేత
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట.ఏప్రిల్, 4.
శివంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామానికి చెందిన కళ్యాణ లక్ష్మి చెక్కులను నర్సాపూర్ నియోజకవర్గ శాసన సభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంజూరైన చెక్కులను తాజామాజీ సర్పంచ్ గైనీబైటి శ్రీనివాస్ గౌడ్ ,తాజా మాజీ ఎంపిటిసి ఆకుల శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉప్పరి సంతోష్ కుమార్ మాజీ సర్పంచ్ జంగం దేవలింగం చేతుల మీదుగా ఉప్పరి బాలమని, జంగం రుక్మిణి, రావెల్లి లక్ష్మి, గుండు నాగమణి, పెద్దపల్లి లక్ష్మి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ తాజా మాజీ ఎంపీపీ కల్లూరు హరికృష్ణ మాజీ జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సూర్ మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్ర గౌడ్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది*




Post Comment