ఉపాధి హామీలో పనిముట్లు ఏవీ గత 15 సంవత్సరాలుగా
ప్రజా సింగిడి ప్రతినిధి చిలిప్ చేడ్ . మే 06 .
ఉపాధి హామీ పనులు చేసే వేతనదారులకు పనిముట్లు లేకపోవడంతో కూలీలపై అదనపు భారం పడుతుంది. 15 సమాచారాలు కిందటి వరకు ఉపాధి హామీకి సంబంధించిన పనిముట్లును ప్రభుత్వమే అందించేది. కానీ గత కొన్నేళ్ల క్రితం కేంద్రం ప్రభుత్వం ఎన్‌ఒసి అనే సాఫ్ట్వేర్ తీసుకొచ్చినప్పటి నుండి ఈ ఉపాధిహామీకి సంబంధించిన పనిముట్లను పూర్తిగా ఇవ్వడం మర్చిపోయారు. దీంతో ఎవరికి వారే సొంతంగా పనిముట్లును కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని నిమిత్తం రూ.200 నుంచి రూ.300 వరకు అదనపు భారము పడుతుందని ఉపాధి కూలీలు వాపోతున్నారు. ఉపాధి హామీ నిబంధనల చట్టం ప్రకారం కూలీలకు 60శాతం పనిముట్లు, 40 శాతం పాలనా ఖర్చుల కింద ఆరు శాతం మించకుండా చూసుకోవాలి. పరిపాలనకు వెచ్చించే నిధులు కింద ఉపాధి హామీ పనిముట్లు కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. గత 15 సమాచారాలు నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ పనిముట్లు కొనుగోలు చేసే వెసులుబాటును కల్పించకపోవడంతో ఉపాధి హామీ సామగ్రిని కొనుగోలు చేసే అవకాశం లేకుండాపోయింది. గతంలో ఉపాధి కూలీలకు పలుగు, పార, తట్ట, నీడ కోసం టెంట్లు, తాగడానికి మంచినీళ్లు, మజ్జిగ, ప్రథమ చికిత్స కిట్లు సరఫరా చేసేవారు.
ఫిబ్రవరి నుండి మే వరకు వేసవి అలవెన్స్ కింద 60 శాతం అదనం అలవెన్స్‌ను ఇచ్చే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇవన్నీ వేతనదారుల చట్టం కల్పించిన హక్కులను పొందులేక అదనపు భారంతో, పనిచేసిన సమయానికి వేతనం అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. మండలంలో లేబర్ గ్రూపులకు వేసవి నిమిత్తం టెంట్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని కూలీలు తెలియజేశారు. ఉపాధి పనులు వేసవిలో జరగడంతో చాలామంది ఈ ఎండ వేడికి సొమ్మసిల్లిన పరిస్థితులు చాలా ఎక్కువ. ఈ పనులు ఎక్కడో గ్రామానికి దూరంగా జరగడంతో వారికి అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం ప్రాథమిక చికిత్స కోసం కిట్లు అవసరాలకు సంబంధించిన మందులు కూడా అందుబాటు లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.కనీసం వీరికి ప్రాథమిక అవసరాలైన మంచినీరు, టెంట్లు కూడా లేవు. ఉపాధి హామీలో సామగ్రి విభాగం కింద పనిముట్లు కొనుగోలు చేయాల్సి ఉన్నా ప్రభుత్వాలు ఈ నిధులతో సిసి రోడ్లు, కాలువలు, బిటి రోడ్లకు మళ్లిస్తున్నట్లు అధికారులే చెబుతున్నారు. దీంతో ఉపాధి హామీ పనికి వెళ్లే కూలీలకు మాత్రం పనిముట్లు కోసం ఎవరికి వారే సొంతంగా కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీని వల్ల అదనపు భారం పడుతుందని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పనిముట్లు అందజేయాలిగతంలో ఉపాధి హామీ పనులకు వెళ్తే కూలీలకు పార, గుణపాలు అందజేసే వారు. తట్టలను కూడా కొనుగోలు చేసి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకపోవడంతో మాలాంటి పేదవారు ఈ కూలి డబ్బుల్లో సగం డబ్బులు ఆ పనిముట్లకే వెచ్చించాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పందించి మాకు ఆ పనిముట్లు అందజేస్తే కూలి డబ్బులు మా జీవనానికి సరిపెట్టుకుంటాం.
వేసవిలో ఎటువంటి పనుల్లేకపోవడంతో ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాం. అక్కడ కనీసం తాగడానికి నీళ్లు, సేదతీరడానికి టెంట్లు అయినా ఏర్పాట్లు చేయలేదు. ఏమైనా అనారోగ్యం పాలైతే వైద్యం కోసం ఇరవై కిలోమీట్లరు దూరంలో ఉండే జోగిపేట రావాల్సి వస్తుంది.
దయచేసి ప్రభుత్వం స్పందించి ఉపాధిహామీ చట్టం ప్రకారం పనిముట్లు అందించి వేతనాలను కూడా సక్రమంగా ఇవ్వాలని కూలీలు కోరుతున్నాను.




Post Comment