ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి చేసే ఆస్థి సంబంధిత*
*నేరాలను గ్యాంగ్ కేసులుగా గుర్తింపు*
*10 సంవత్సరాలుగా గ్యాంగ్ నేరాలనువ్యక్తులపై గ్యాంగ్ కేసులు నమోదు*
*సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ఆదేశాలు జార*
ప్రజా సింగిడి ప్రతినిధి ఆగస్టు 23
సంగారెడ్డి జిల్లా పట్టణంలో ఎస్పీ మాట్లాడుతూ గ్యాంగ్ కేసులు నమోదు చేయడానికి ముఖ్య ఉద్ధేశ్యం అలవాటు పడిన నేరస్తులు, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు కలిసి గ్యాంగ్ గా ఏర్పడి, వివిధ రకాల ఆస్థి సంబంధిత నేరాలకు పాల్పడుతున్నారని, వీరి నుండి సమాజాన్ని రక్షించాలని, భవిష్యత్తులో తిరిగి ఇలాంటి నేరాలు చేయకుండా నివారించడమే ఈ గ్యాంగ్ కేసుల ముఖ్య ఉద్ధేశ్యం అన్నారు.
నూతన చట్టాలను అనుసరిస్తూ తెలంగాణ రాష్ట్ర డి.జి.పి జితేందర్ ఐపిఎస్ ఆదేశానుసారం, గడిచిన 10 సంవత్సరాలలో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు కనీసం రెండు నేరాలలో పాల్గొన్నట్లయితే వారిపై గ్యాంగ్ కేసులను నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులకు సూచించారు.
ఈ గ్యాంగ్ కేసులు నాన్ బెయిలబుల్, న్యాయస్థానం ముందు నిందితులకు 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష జరిమానా కూడా విధించడం జరుగుతుందన్నారు.
Post Comment