ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం పనులలో వేగం పెంచాలి…
ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం పనులలో వేగం పెంచాలి…
◆ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ .
ప్రజా సింగిడి, కామారెడ్డి ,జూన్ 10:
నవంబర్ లోగా ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం పూర్తయేలా పనులలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పంచాయతీరాజ్ ఇంజనీర్ ను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ మంగళవారం కామారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళ శక్తి భావన నిర్మాణం పనులు జిల్లాలో జరగాల్సి ఉందని అన్నారు. మేస్త్రీలను ఇతర కార్మికులను అధికంగా నియమించుకొని పనుల్లో వేగం పెంచి నవంబర్ లోగా పూర్తిస్థాయిలో నిర్మాణం పనులు జరిపించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిఈ స్వామి దాస్, ఏఈ సంజయ్ ని ఆదేశించారు.




Post Comment