ఇంటర్ విద్యార్థి అదృశ్యం ధర్యాప్తు చేస్తున్న ఎస్ ఐ
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 22.
ఇంటర్ విద్యార్థి అదృశ్యమైన సంఘటనమెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధి దంతాలపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపిన వివ రాల ప్రకారం గ్రామానికి చెందిన గొల్ల మల్లేష్-లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమా రులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు రేవంత్ కుమార్ వయస్సు (16 )సం,, రాలు తూప్రాన్ లోని ఓ ప్రయివేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం సుమారుగా 1:30గంటలకు పొలానికి వెళ్లి వస్తానని ఇంట్లో అమ్మకు చెప్పి వెళ్లాడు సమయం 3 కావస్తున్న ఎంతకీ రాకపోవడంతో కంగారుగా ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. గతకొన్ని రోజులుగా అప్పుడప్పుడు రేవంత్ కుమార్బోనం ఎత్తుకోవడానికి కొంతమందితో కలిసి జాతర్లకు వెళ్తున్డగా మూడు సార్లు తీసుకొచ్చామన్నారు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి మల్లేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని శివ్వంపేటఎస్ ఐ మధుకర్ రెడ్డి తెలిపారు




Post Comment