హుస్నాబాద్ కేజీబీవీ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
ప్రజా సింగిడి ప్రతినిధిన్యూస్ జూన్ 12
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేజీబీవీ పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు.వేసవి సెలవుల అనంతరం నేడు పాఠశాలలు పునః ప్రారంభం అవడంతో విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను కంప్యూటర్ ల్యాబ్ మెళుకువలు ఉపయోగించుకొని విద్యార్థులు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.




Post Comment