హత్య చేసిన వ్యక్తుల అరెస్టు
జహీరాబాద్, డిఎస్పి రామ్మోహన్ రెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి జహిరాబాద్. ఏప్రిల్, 08.
హత్య చేసిన ఇద్దరు నిందితులను అనతి కాలంలోనే పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు చిరాకుపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.డి.ఎస్.పి రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మొగుడంపల్లి మండలము ధనసిరి గ్రామానికి చెందిన అబ్బాస్ అలీని అదే గ్రామానికి చెందిన మహతాబ్ బిస్తీ, ఖలీల్ షా ఇద్దరు కలిసి ఫామ్ హౌస్ లో క్రూరంగా కత్తులతో పొడిచి చంపారని ఆయన తెలిపారు. హత్య చేసిన అనంతరం వారు పారిపోతూ మార్గమధ్యలో అదే గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తిని ఎయిర్ పిస్టల్ కత్తులతో బెదిరించి షహీన్ మోటార్ సైకిల్ ను లాక్కొని పరారయ్యారన్నారు. ఈనెల 6న హత్య జరగగా 8 తారీఖున నిందితులను పుకాట్ నగర్ జహీరాబాద్ ప్రాంతంలో తమ సిబ్బంది వల పని పట్టుకున్నారని తెలిపారు. నేరస్తులను విచారించి రిమాండ్ కు తరలించామన్నారు.నేరస్తుని తల్లికి అనవసరంగా ఫోన్ చేసి విసిగిస్తుండడంతో ఆమె తన కుమారుడైన మహతాబ్ కు చెప్పడంతో ఆయన పలుమార్లు మందలించినప్పటికీ వీరు మారకపోవడంతో ఈ హత్య చేసినట్లు డిఎస్పీ తెలిపారు. నిందితుల నుండి రెండు ద్విచక్ర వాహనాలు ఎయిర్ గన్ కత్తులు సెల్ఫోన్ స్వాధీనపరచుకున్నట్లు డిఎస్పీ తెలిపారు.నిందితులను పట్టుకునేందుకు జహీరాబాద్ పట్టణ వలయా అధికారి ఎస్, శివలింగం చిరాక్ పల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నర్సింలు, సిబ్బంది ఆనంద్ లతోపాటు మునిపల్లి చెందిన ఒక హోంగార్డు కూడా కీలక పాత్ర వహించారని ఆయన తెలిపారు. కాలంలోనే ఈ కేసును చేదించి నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన సిబ్బందిని ఆయన అభినందించారు.




Post Comment