హత్నూర మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా రామచంద్రారెడ్డి
నియమించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
- ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర.ఏప్రిల్,15.
మంగళవారం హత్నూర మండలంలోని ఉమ్మన్న గారి దేవేందర్ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కొన్యాల గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డిని హత్నూర మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నియమించారు. ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ లో జరిగే భారీ బహిరంగసభకు ఏర్పాటుచేసిన సమావేశంలో భాగంగా సునీతా లక్ష్మారెడ్డి నాయకులకు, కార్యకర్తలకు దిశనిర్దేశం చేశారు. హత్నూర మండలం నుండి వరంగల్ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని ఆదేశించారు. పార్టీ ఆవిర్భావించి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు ఇప్పటి నుంచే గ్రామాల వారిగా సన్నాహక సమావేశం పెట్టుకోవాలని నేతలకు సూచించారు. అలాగే ప్రతీ గ్రామంలో జెండా ఆవిష్కరించి, జనసమీకరణ చేసి సభకు వచ్చే విధంగా చేసి సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ ఉమ్మన్న గారి దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వావిలాల నర్సింలు, దామోదర్ రెడ్డి, శివశంకర్ రావు,మాయిని శ్రీకాంత్, కృష్ణ, దూది పోచయ్య, అర్జున్, మధు, అజ్జు,సురేష్ గౌడ్, శంకర్, ఆశయ్య, రమేష్ గౌడ్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.




Post Comment