సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
*
సామాజిక సేవలో మరో ముందడుగు – ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా రూ 8,66,500 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ*
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్. ఏప్రిల్, 28.
వెల్దుర్తి, కౌడిపల్లి మండలానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ₹10,66,500 విలువైన చెక్కులను తెలంగాణ పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వ సహాయాన్ని పొందడంలో చేసిన ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం తమ ధ్యేయమని పేర్కొన్న ఆవుల రాజిరెడ్డి , “సామాజిక న్యాయం, పారదర్శక పాలన, నిరంతర ప్రజా సేవే మా లక్ష్యం. అవసరమైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాం,” అని హామీ ఇచ్చారు.అదనంగా, ఆరోగ్య సంబంధిత అత్యవసర ఖర్చులను ఎదుర్కొంటున్న మరిన్ని బాధితుల వివరాలు సేకరించి, వారి పట్ల తక్షణమే ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా చొరవ చూపనున్నట్లు ఆవుల రాజిరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
సామాజిక సేవలో మరో ముందడుగు – ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా రూ 8,66,500 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ*



Post Comment