సిగాచి పరిశ్రమ పేలుల్లలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన సీఎం*
ప్రజాసింగిడి ప్రతినిధి సంగారెడ్డి.జులై 1
పటాన్ చెరు లోని ధ్రువ ఆసుపత్రిని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. పాశమైలారం లొ సోమవారం సిగాచి పరిశ్రమ పేలుల్లలో గాయపడిన క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి ని డాక్టర్లతో ఆరా తీశారు. సీఎం వెంబడి మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకట స్వామి, కాంగ్రెస్ నేత నీలం మధు, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎస్పి పరితోష్ పంకజ్ ఉన్నారు తదితరులు ఉన్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.




Post Comment