సరస్వతి శిశు మందిర్ పాఠశాల సీజ్
ప్రజా సింగిడి ప్రతినిధి మర్చి 22 జహీరాబాద్
జహీరాబాద్, మునిసిపల్ పరిదిలో సరస్వతి శిశు మందిర్ పాఠశాల యాజమాన్యం మున్సిపాలిటీకి ఆస్తిపన్ను బకాయి ఉండటం వల్ల అధికారులు ఆ పాఠశాలను సీజ్ చేశారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు 100 శాతం ఇంటి పన్నులు ఆస్తి పన్నులు వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు బకాయి ఉన్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. శనివారం నాడు జహీరాబాద్ మునిసిపల్ పరిధిలో ఉన్న సరస్వతి శిశు మందిర్ 27 లక్షలు ఆస్తి పన్ను బకాయి ఉన్న కారణంగా మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్ సిబ్బందితో కలిసి వెళ్లి పాఠశాలను సీజ్ చేశారు




Post Comment