శ్రీ షిరిడి సాయిబాబా పంచలోహ ఉత్సవ విగ్రహానికి 17వేల రూపాయలను విరాళం
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 27.
- చిరంజీవి వ్రితిక హై కోర్ట్ సీనియర్ న్యాయవాది పెద్దగోని శివకుమార్ గౌడ్ మనవరాలు డాక్టర్ సుధాకర్ రచితల ఏకైక కూతురు 26 ఎప్రిల్ తన 12వ పుట్టినరోజు సందర్భంగా అమెరికా ఫ్లోరిడా నుండి శ్రీ గురు పీఠంలో స్థాపించబోయే శ్రీ షిరిడి సాయిబాబా పంచలోహ ఉత్సవ విగ్రహానికి 17వేల రూపాయలను విరాళంగా పంపించడం జరిగినది. చిరంజీవి వ్రితికకు జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి వ్రితిక ఎంతో సంస్కారంగా మన తెలుగువారి నాట్య కళావైభవాన్ని అభ్యసిస్తూ ఉన్నతమైన విద్యా నైపుణ్యతను కనబరుస్తూ చదువులో ఉన్నత స్థాయిని కనబరుస్తున్నారు. చిరంజీవి వ్రితిక భవిష్యత్తులో ఉన్నత చదువులు అభ్యసించి ఆయురారోగ్యాలతో బంగారు భవిష్యత్తు ప్రసాదించాలని దత్త స్వరూపులు శ్రీ సాయినాధుని ప్రార్థిస్తున్నాం చిరంజీవి వ్రితికను శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ తరఫున అభినందించారు




Post Comment