శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
ప్రజా సింగిడి ప్రతినిధి సంగారెడ్డి. మర్చి, 30.
సంగారెడ్డి జిల్లా ప్రజలకు, జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా ఎస్పీ గారు అన్నారు. తీపి, చేదు, కష్ట, సుఖాలు తెలిసిందే జీవితం అని, ఆ జీవితంలో ఆనందోత్సాహాలు పూయించెందుకు ఉగాది వచ్చిందన్నారు. కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో సంతోషంగా ఉగాది పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచ మానవాళికి అన్నం పెట్టే రైతన్నలకు పాడిపంటలతో సిరిసంపదలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానాని, సంగారెడ్డి జిల్లా ప్రజలకు, జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.




Post Comment