శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర వార్షికోత్సవమునకు హాజరైన ఎమ్మెల్యే, మండల మాజీ ప్రజా ప్రతినిధులు
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 19.
శివ్వంపేట మండలం కొత్తపేట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మూడవ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరైనారు. అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో ఉండాలని ఆ రేణుక ఎల్లమ్మ తల్లి దేవతను వేడుకున్నాను అని అన్నారు. కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్ భాయ్, శివంపేట మండల తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, శివంపేట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజా రమణ గౌడ్, మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు లాయక్ బాయ్, మరియు మండలంలోని వివిధ గ్రామాల టిఆర్ఎస్ నాయకులు మరియు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి భక్తులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment