శ్రీ గురు పీఠం దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాల ఊరేగింపు
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వపేట. ఏప్రిల్, 25.
శివ్వంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలోని శ్రీగురు పీఠంలోనిర్మి స్తున్న షిరిడి సాయిబాబా దత్తాత్రేయ దేవాలయాలలో ప్ర తిష్ఠించే సాయిబాబా దత్తాత్రేయ విగ్రహాలను గురువారం శివ్వంపేట మండల కేంద్రంలోని రామాలయం నుండి గూడూరు గ్రామంలోని శ్రీ గురు పీఠం వరకు ప్రముఖ పురోహితులు శాస్త్రుల వామన శర్మ ఆధ్వర్యంలో ఊరే గింపుగా తీసుకువెళ్లడం జరిగింది. శ్రీ గురు పీఠం వ్యవ స్థాపక అధ్యక్షులు రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్ గౌడ్, రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో ఈ దేవాలయాలు నిర్మించిన విషయం అందరికీ తెలిసింది. సాయిబాబా దత్తాత్రేయ స్వామి ఊరేగింపు శోభయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ప్రముఖులు ప్రజలు భక్తులు సీనియర్ న్యాయవాది శివకుమార్ గౌడ్, సాదరంగా ఆహ్వానించారు. ఈ ఊరేగింపు దైవ సాంప్రదాయ పద్ధతిలో మంత్రోత్సవం మధ్య తీసుకువెళ్లడం జరిగింది. ఈ ఊరేగింపు కార్యక్రమం లో రాష్ట్ర హైకోర్టు న్యాయవాది శివకుమార్ గౌడ్, మాజీ సర్పంచులు పులిమామిడి స్రవంతి నవీన్ గుప్తా, పత్రాల శ్రీనివాస్ గౌడ్, స్వరాజ్ లక్ష్మి శ్రీనివాస్ గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బొడ్డు రవి గౌరవాధ్యక్షులు ఇసుగారి మల్లేష్, మాజీ ఉపసర్పంచ్ లు రాజీపేట పద్మా వెంకటేష్, ప్రముఖ వ్యాపారవేత్తలు నోముల హనుమంతు గుప్తా, రాజ్యం బిక్షపతి యాదవ్, నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్, వారాల గణేష్,ఇసారపు రాజు గౌడ్, దానబోయిన కృష్ణ, వంజరి గౌరీ శంకర్, బిజిలిపురం సత్తయ్య, బాసంపల్లి ప్రభు లింగం గౌడ్, కమలయ్య గారి వెంకటేష్, కొత్తపేట వెంకటేష్ గౌడ్, భీమనపల్లి మురళి, బల్కంపేట భాస్కర్ కొంతనపలి సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు.




Post Comment