శ్రీ గురుపిఠం లో అతి త్వరలో ప్రతిష్టించబోయే శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పరంపర దత్తావతారుల మూర్తుల బ్యానర్ను ఆవిష్కరన
ప్రజా సింగిడి ప్రతినిది శివంపేట . ఏప్రిల్ ,22.
శ్రీ
గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం రోజున శ్రీ గురు పీఠంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు శ్రీ గురు పీఠం ట్రస్ట్ సభ్యులు శ్రీ జిన్నారం పెద్దదోని శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వారు మాట్లాడుతూ మంగళవారం శ్రీ గురుపిఠం లో అతి త్వరలో ప్రతిష్టించబోయే శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పరంపర దత్తావతారుల మూర్తుల బ్యానర్ను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా శ్రీ దత్తాత్రేయ వైభవాన్ని తెలియజేసే పుస్తకాన్ని శ్రీశ్రీశ్రీ విశ్వ యోగి విశ్వం జి మహారాజ్ గుంటూరు విశ్వ గురు పీఠం పీఠాధిపతులు ఆవిష్కరించిన గురువైభవ పుస్తకాన్ని భక్తులందరికీ విడుదల చేయడం జరిగినది అతి త్వరలో పుస్తకాల వితరణ ఉంటుంది ప్రతి భక్తునికి ఈ పుస్తకాలు అందజేస్తారు అని వివరించారు మరియు శివంపేటకు చెందిన లస్కర్ బిక్షపతి భజన బృందానికి హార్మోనియం రెండు తబలాలు ఐదు జతల తాళాలు అందించి నిరంతరంగా దైవారాధనలో పాల్గొంటూ మరియు శ్రీ గురు పీఠంలో క్రమంగా జరిగే సత్సంగములో పాల్గొని భజనలు చేయాలని సూచించారు శ్రీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రేపు గురువారం రోజున జైపూర్ నుండి బయలుదేరిన శ్రీ దత్తాత్రేయ స్వామి సహిత విగ్రహాలు శ్రీ గురు పీఠంకు చేరుతున్నందున భక్తులందరూ శ్రీ మహా దత్తాత్రేయ స్వామి పరంపర గురువులందరినీ భక్తిశ్రద్ధలతో సుస్వాగతం పలకాలని ముఖ్యంగా మరియు గూడూరు శివంపేట గ్రామ ప్రజలందరూ రాజకీయాలకతీతంగా ఈ ఊరేగింపులో పాల్గొనాలని ఆ దత్తాత్రేయుని ఆశీస్సులు పొందాలని ఈ సదవకాశాన్ని మండలంలోని భక్తులందరూ వినియోగించుకోవాలని ముఖ్యంగా మహిళలు స్వామికి మంగళ హారతులు ఇచ్చి గురుపాదాలు కడిగి స్వాగతించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురుపీఠం ట్రస్ట్ సభ్యులు శ్రీ జిన్నారం శ్రీనివాస్ గౌడ్, నోముల హనుమంత్, రాజ్యం బిక్షపతి మరియు శ్రీ గుపీఠం సేవా సభ్యులు శ్రీ జంగం వెంకటేష్, కొంతాన్ పల్లి సత్యనారాయణ కుమ్మరి భాస్కర్, గోనెయ్య, విశశ్రీ లాచాంబర్స్ సభ్యులు నల్లపల్లి శ్రీనివాస్, శ్రీ రాజేందర్ రెడ్డి, లస్కర్ బిక్షపతి భజన బృందం, గూడూరు శివంపేట గ్రామస్తులు పాల్గొన్నారు




Post Comment