శ్రీకూర్మ కప్పర నరసింహస్వామి జయంతి ఉత్సవాలు
ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాపర్, తూప్రాన్ మే,9
స్వయంభు శ్రీ కూర్మ కప్పర నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఈనెల 10 నుండి 11వ తేదీ ఆదివారం వరకు నిర్వహించుటకు నిశ్చయించినది.. ఈరోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను విడుదల చేయనైనది ….వందల సంవత్సరాల క్రితం వెలసిన స్వయంభు నరసింహుని జయంతి వేడుకల్లో తూప్రాన్ మున్సిపల్ ప్రజలందరూ పాల్గొనాలని స్వామివారి కృపకు పాత్రులు కావాలని, అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు తూప్రాన్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ మామిళ్ళ జ్యోతి కృష్ణ, ఆలయ ప్రధాన కార్యదర్శి కంటాయపాలెం వేణుగోపాల్, పురోహితులు ప్రవీణ్ పేర్కొన్నారు.. కమిటీ నిర్వాహకులు తిరునగరి ప్రదీప్ సింహ అహోబిలం శ్రీనివాస్ సురేష్, రాఘవేందర్ పేర్ల లక్ష్మణ్ విష్ణు బొల్లునాగులు తదితరులు పాల్గొన్నారు




Post Comment