శివ్వంపేటలో WDCW ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

– *బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి*
– *జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్*
బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ .
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. అక్టోబర్, 31.
శుక్రవారం శివ్వంపేటలో డబ్ల్యూడిసిడబ్ల్యూ (మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ) ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన, పిల్లలు అభివృద్ధిపై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగకుండా గ్రామాలు, తండాల్లో ప్రజలకు అవగాహన కల్పించి బాల్యవివాహాలు జరగకుండా చూడాలన్నారు, బాల్య వివాహాలు జరిగితే అంగన్వాడీ, ఆశా, పంచాయతీ కార్యదర్శులదే బాధ్యతని హెచ్చరించారు.
మెదక్ జిల్లాను బాల్యవివాహాలు జరగని జిల్లాగా మార్చాలని తెలిపారు. పిల్లలందరూ బడిలో ఉండాలన్నారు. పిల్లల చేత పనిచేయడం నేరమని తెలిపారు. కిశోర బాలికలకు సంబంధించిన వివరాలు బి ఎల్ ఓల వద్ద ఉండాలన్నారు. కిషోర్ బాలికలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయం తప్పనిసరిగా సేకరించాలని సూచించారు.
అనంతరం DWO హేమ భార్గవి మాట్లాడుతూ గ్రామాలు తండాల్లో బాల్య వివాహాల నిర్మలనకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని తెలిపారు.
ఈ సందర్భంగా WDCW, ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తాసిల్దార్ కమలాద్రి, ఐసిడిఎస్ మండల సూపర్వైజర్లు సంతోష, వసుమతి, ఐకెపి, అంగన్వాడి, ఆశ, పంచాయతీ సెక్రటేరియట్ లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




Post Comment